కటౌట్ సరిపోదు... కంటెంట్ కంపల్సరీ

Wednesday,October 02,2019 - 10:03 by Z_CLU

తమిళ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ లో ఆదరణ తగ్గుతుందా..? కోలీవుడ్ స్టార్ హీరోలకు టాలీవుడ్ లో డిమాండ్ తగ్గుతుందా..? అదే నిజమైతే రిలీజైన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడాలి కదా… టాలీవుడ్ రీసెంట్ బాక్సాఫీస్ గ్రాఫ్ చూస్తే ఒక్కోసారి స్ట్రేట్ సినిమాని కూడా ఈ డబ్బింగ్ సినిమాలు డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. కాకపోతే సినిమాలో విషయముండాలి. అదొక్కటే కండిషన్.

ఈ మధ్య వరసగా సూర్య సినిమాలు బోల్తా పడ్డాయి. గతంలో రిలీజైన NGK తేలిపోయేసరికి రీసెంట్ గా ‘బందోబస్త్’ కి మరింత ఫోకస్డ్ గా ప్రమోషన్స్ చేసుకున్నాడు సూర్య.. అయినా వర్కవుట్ కాలేదు. కానీ ఇదే సూర్య నటించిన గత చిత్రాలు గజనీ, సింగం సిరీస్ ఇక్కడ హిట్ అయ్యాయి.

మరో హీరో విశాల్ ది కూడా ఇదే పరిస్థితి… రీసెంట్ రిలీజెస్ పందెంకోడి 2, ఆయోగ్య కనీసం రిలీజయ్యాయి అనే టాక్ కూడా లేకుండా క్లోజయ్యాయి. అంతకంటే ముందు విశాల్ నటించిన డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలు క్లిక్ అయ్యాయి. దీనికి కారణం కేవలం కంటెంట్.

మరో హీరో విక్రమ్ కి కూడా ఆల్మోస్ట్ తెలుగు స్టార్ హీరోలకున్నంత క్రేజ్ ఉండేది. తను ఎంచుకునే కంటెంట్ అలాంటిది మరి… కానీ ఈ ఇమేజ్ కూడా ఫేడవుట్ అయిపోయింది. రీసెంట్ గా రిలీజైన ‘మిస్టర్ KK’ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అలాగని తమిళ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ లో స్పేస్ లేదా..? అలా ఫిక్సవ్వడానికి కూడా లేదు.

విజయ్ హీరోగా నటించిన ‘తుపాకి’, ‘అదిరింది’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ అనిపించుకున్నాయి. నిజానికి విజయ్ కు టాలీవుడ్ లో మార్కెట్ లేదు. కానీ అతడి సినిమాలు ఆడాయంటే దానికి కారణం కంటెంట్.

కార్తీ ఆవారా, నా పేరు శివ, యుగానికొక్కడు సినిమాలకు ఇప్పటికీ తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని కార్తీ ఎలాంటి  సినిమా చేసిన చూస్తారా..? సమాధానం ‘దేవ్’ సినిమా.. గట్టిగా 3 రోజులు కూడా నిలబడలేదు.

అల్టిమేట్ గా తమిళ సినిమాలు టాలీవుడ్ లో నిలబడాలంటే కటౌట్ అస్సలు సరిపోదు. కచ్చితంగా కంటెంట్ ఉండాల్సిందే.