బెల్లంకొండ ‘సాక్ష్యం’ లో స్టన్నింగ్ విజువల్స్

Thursday,July 12,2018 - 02:32 by Z_CLU

ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ బెల్లంకొండ ‘సాక్ష్యం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ‘ఇష్క్ కర్లే..’ ప్రోమో సాంగ్ లోని విజువల్స్ సినిమా స్టాండర్డ్స్ ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.

U.S. లోని రేర్ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ సాంగ్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్స్ గా నిలుస్తుందంటున్నారు ఫిల్మ్ మేకర్స్. దానికి తగ్గట్టే ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో భారీగా సర్క్యులేట్ అవుతుంది. ‘నేచర్ ఈజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ ‘సాక్ష్యం’ లో ప్రతి ఎలిమెంట్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది.

 

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్  కంపోజ్ చేశాడు. జగపతి బాబు, మీనా,  శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్న ఈ సినిమా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.