4 డిఫెరెంట్ లుక్స్ లో హీరో సూర్య

Tuesday,June 26,2018 - 01:15 by Z_CLU

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది సూర్య 37 వ సినిమా. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిన్న లండన్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇమ్మీడియట్ గా ఈ సినిమా షూటింగ్ బిగిన్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, నెల రోజుల పాటు లండన్ లోనే షూటింగ్ జరుపుకోనున్నారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్న ఫిల్మ్ మేకర్స్, ఏకంగా 10 దేశాల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే బయటికి రాలేదు కానీ సూర్య ఈ సినిమాలో 4 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. లండన్ లో తెరకెక్కనున్న ఈ షెడ్యూల్ కోసం గడ్డం లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు సూర్య. అయితే సినిమాలో సూర్య ప్లే చేయనున్న మిగతా 3 గెటప్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరాసిటీ ఫ్యాన్స్ లో రేజ్  అవుతుంది.

 

రీసెంట్ గా ఈ సినిమాలో సూర్య సరసన సాయేషాని ఫైనల్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానిని మరో కీలక పాత్రలో ఫిక్స్ చేసుకున్నారు. మోహన్ లాల్ తో పాటు అల్లు శిరీష్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో మెస్మరైజ్ చేయనున్నారు.

 

ఈ సినిమాతో పాటు మరో వైపు సెల్వరాఘవన్ డైరెక్షన్ లో నటిస్తున్న సూర్య, వీలైనంత త్వరలో ఈ సినిమాకు  ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నాడు. సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలోను సూర్య, ఆల్మోస్ట్ గడ్డం లుక్ లోనే కనిపించనున్నాడు.