ఆ టైటిల్ ఎన్టీఆర్ కోసమేనా?

Saturday,January 07,2017 - 12:40 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాను బాబీ డైరెక్షన్ లో  చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్న ఈ సినిమా టైటిల్ పై టాలీవుడ్ లో రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ యూనిట్ ఈ సినిమాకు ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ తో పాటు మరి కొన్ని టైటిల్స్ పరిశీలిస్తు న్నారనే వార్త వినిపించగా లేటెస్ట్ గా మరో టైటిల్ ప్రచారం లో కొచ్చింది.

తారక్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించనున్న ఈ సినిమా కోసం   ‘జై లవ కుశ’ అనే టైటిల్ ను లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించాడనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి తన సినిమాలతో పాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ ఎన్టీఆర్ కోసమే రిజిస్టర్ చేయించాడా? లేదా తన నిర్మాణం సంస్థ లో ఈ టైటిల్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడా? అనే విషయం పై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది..