సెంటిమెంట్ తో బన్నీ ...

Saturday,January 07,2017 - 11:23 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ ఓ సెంటిమెంట్ తో సతమతమవుతున్నాడు. ఇంతకీ బన్నీ ను ఇబ్బంది పెడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి? అనుకుంటున్నారా. ఆ సెంటిమెంట్ మరేదో కాదు అల్లు అర్జున్ కి కలిసొచ్చిన ఓ నెల. లేటెస్ట్ గా బన్నీ నటించిన కొన్ని సినిమాలు ఏప్రిల్ నెల లో రిలీజ్ అయి గ్రాండ్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే.

   అందుకే ఏప్రిల్ నెలను ఓ సెంటిమెంట్ నెలగా ఫీలవుతాడు బన్నీ. అయితే ప్రెజెంట్ దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘డి.జె దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా చేస్తున్న బన్నీ ఈ సినిమాను మార్చ్ లో షూటింగ్ ఫినిష్ చేసి ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఈ ఏడాది అదే నెలలో బాహుబలి థియేటర్స్ లోకి వస్తుండడం తో ఆ నెల గురించి తెగ ఆలోచిస్తున్నాడట స్టైలిష్ స్టార్. మరి ఈ సెంటిమెంట్ తో అదే నెలలో బన్నీ డి.జె గా వస్తాడా? లేదా మే నెలకు షిఫ్ట్ అవుతాడా? చూడాలి.