పవన్ ఎంట్రీ పై సస్పెన్స్...

Saturday,January 07,2017 - 02:26 by Z_CLU

మెగా స్టార్ రి ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు హైలాండ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఫంక్షన్ కు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్ల తో గెస్ట్ లకు ఫాన్స్ కు మెగా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు మెగా ఫ్యామిలీ. మెగా హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు హాజరు కానున్న ఈ మెగా ఈవెంట్ పై ఓ సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతుంది.

Pawan attending in Khaidi No 150 pre release Function ?

ఆ సస్పెన్స్ మరేదో కాదు పవర్ స్టార్ ఎంట్రీ . మెగా స్టార్ ప్రతిష్టాత్మక 150 సినిమా కావడం తో భారీ గెస్ట్ లతో భారీ రేంజ్ లో జరగబోతున్న ఈ ఫంక్షన్ కి పవన్ ఎటెండ్ అవుతాడా? లేదా ? అనే సస్పెన్స్ అటు మెగా ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ లోకూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక లేటెస్ట్ గా జరిగిన కొన్ని మెగా ఈవెంట్స్ కు డుమ్మా కొట్టిన పవన్ మెగా ఫామిలీ లోనే గ్రాండ్ ఈవెంట్ గా జరగబోతున్న  ఈ మెగా ఈవెంట్ కైనా వస్తాడా? అనే చర్చ జరుగుతుంది.  అయితే ఓ వైపు చిరు తో కలిసి పవన్  ఒకే సారి ఈ వేదిక పై ఓ డిఫరెంట్ స్టైల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం జరుగుతుండగా మరో వైపు పవన్ ఈవెంట్  క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఏదేమైనా పవన్ ఎంట్రీ పై మాత్రం ఇంకా సస్పెన్సే అంటున్నారు మెగా వర్గం…