కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ

Friday,March 23,2018 - 01:41 by Z_CLU

కళ్యాణ్ రామ్ M.L.A. ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ షో తోనే టాలీవుడ్ లో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది కాజల్ అగర్వాల్. అవి మీ కోసం…

డిఫెరెంట్ గా అనిపించింది…

కళ్యాణ్ రామ్ తో పని చేసి 10 ఇయర్స్ అవుతుంది. ఈ పదేళ్ళలో చాలా మారిపోయింది. అయినా మాధ్య కంఫర్ట్ లెవెల్స్ మారలేదు. షూటింగ్ మధ్యలో తేజ గారి గురించి మాట్లాడుకున్నాం. చేసే ప్రతి సీన్ ని డిస్కస్ చేసుకుంటూ మరీ చేశాం.

 

అసలు కలవలేదు…

లక్ష్మీ కళ్యాణం సినిమా తరవాత నేను కళ్యాణ్ రామ్ అసలు కలుసుకోలేదు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు టచ్ లో ఉండేంత టైమ్ ఉండదు. ఒకసారి ఒక సినిమా కలిసి చేశామంటే, మళ్ళీ ఎవరికి వారు నెక్స్ట్ సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ డెఫ్ఫినెట్ గా ఆ రిలేషన్ షిప్ అలాగే ఉంటుంది.

నిజంగా అనుకోలేదు…

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా తరవాత కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తానని అసలు అనుకోలేదు. నిజానికి నా ప్లాన్స్ ప్రకారం ఆ సినిమా తరవాత నేను M.B.A. చేయాలి అదే నా టార్గెట్. సినిమాల గురించి ఆలోచన కూడా లేదు. కానీ తెలుగు ప్రజలు చూపిన ప్రేమ నన్నీ స్థాయిలో నిలబెట్టింది. లైఫ్ లాంగ్ వారికి రుణపడి ఉంటాను.

అప్పటికి గాని అర్థం కాలేదు…

ఒక రకంగా చెప్పాలంటే సినిమా తరవాత సినిమా చేస్తున్నాను కానీ, సినిమాలే నా కెరియర్ అన్న క్లారిటీ మాత్రం ‘మగధీర’ సినిమా తరవాత వచ్చింది. ఇక లైఫ్ ఇదే…

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నేను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమాలో ఇంటర్వెల్ పాయింట్ వరకు అసలు తనేం చేస్తుందీ..? ఎందుకు చేస్తుందీ అనేది సస్పెన్స్. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి సినిమాలో.

 

మెసేజ్ ఉంటుంది కానీ…

మల్టీ జోనర్ సినిమా M.L.A. సినిమాలో ఇన్ డెప్త్ గా మంచి మెసేజ్ ఉంటుంది. అలాగని బలవంతంగా అందరి నెత్తిపై రుద్దినట్టు ఉండదు. కమర్షియల్ వ్యాల్యూస్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది సినిమా.

బ్యాలన్స్ కంపల్సరీ…

ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలి అందరూ అనుకుంటారు కానీ ఒక్కోసారి కెరియర్ ని బ్యాలన్స్ చేసుకోవడం కూడా అంతే అవసరం. ఏదో ఈ రోజు జస్ట్ గ్లామరస్ రోల్సే చేయకూడదు అంటున్నాను కానీ, నేను చాలా సినిమాలలో అలా కూడా నటించాను. ఇష్టపడి చేశాను. కానీ అవకాశం ఉన్నప్పుడు స్ట్రాంగ్ రోల్స్ ఎంచుకోవడం ఇంకా బావుంటుంది.

టార్గెట్ పెట్టుకోలేదు…

ఇన్ని సినిమాలు చేయాలి, ఈ హైట్స్ కి రీచ్ అవ్వాలి నేను ఎప్పుడూ అనుకోలేదు. సిన్సియర్ గా మన పని మనం 100% చేయలానేదే నమ్ముతాను నేను.

కళ్యాణ్ రామ్ గురించి…

చాలా ప్యాషనేట్ నటుడు. నిజాయితీగా ఉంటాడు. తన ఫ్యామిలీ గురించి.. పిల్లల గురించి.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు.

ఎప్పుడూ స్పెషల్ కాదు….

జనతా గ్యారేజ్’ సినిమా తరవాత స్పెషల్ సాంగ్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి. స్పెషల్ అనిపించుకోవాలి అని నాకూ ఉంటుంది కానీ, రెగ్యులర్ గా కాదు, జస్ట్ ఎప్పుడో ఒకసారి…

 

ఆ ఆలోచన నాదే….

గత 2, 3 ఏళ్లుగా డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అలా గతంలో చేయలేదా అంటే చేశాను కానీ, ఏదో రకంగా పాసిబుల్ అవలేదు. కానీ ఇప్పుడు డిఫెరెంట్ కాన్సెప్ట్స్ వింటున్నాను కాబట్టి, డెసిషన్స్ తీసుకుంటున్నాను. అటు గ్లామర్ రోల్స్ తో పాటు డిఫెరెంట్ రోల్స్ చేస్తూ కెరియర్ ని బ్యాలన్ చేసుకుంటున్నాను. శ్రీనివాస్ బెల్లంకొండతో ఓ వైపు కమర్షియల్ సినిమాలో చేస్తున్నాను, మరో వైపు క్వీన్ రీమేక్ లో నటిస్తున్నాను.

నచ్చితేనే ఏదైనా…

బాలీవుడ్ సినిమా చేసినా నచ్చితేనే చేస్తా… స్క్రిప్ట్ నచ్చితే ఏ లాంగ్వేజ్ లో సినిమా చేయడానికైనా రెడీ, కానీ జస్ట్ బాలీవుడ్ అన్న ఫీలింగ్ తో హిందీ సినిమా చేయను…

అలాంటి ఫీలింగ్ లేదు…

ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. ఇక్కడ ఎంతమంది పనిచేయడానికైనా అవకాశం ఉంది. కొత్తవాళ్ళు వస్తున్నారన్న ఇంసెక్యూర్డ్ ఫీలింగ్ లేదు.

మేల్ డామినేషన్….

ఇండస్ట్రీలో నాకు మేల్ డామినేషన్ ఎక్కడా కనిపించలేదు. అందరూ కలిసి పనిచేస్తారిక్కడ. చాన్స్ దొరికినప్పుడూ ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటాం. టీమ్ ఎఫర్ట్ ఉంటుంది కానీ డామినేషన్ ఎక్కడా ఉండదు.