మాతంగి - వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Friday,March 23,2018 - 04:14 by Z_CLU

హారర్ డివోషనల్ మూవీగా తెరకెక్కిన మాతంగిలో 2 డిఫరెంట్ షేడ్స్ లో ఎట్రాక్ట్ చేశారు రమ్యకృష్ణ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు జీ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయింది. జీ సినిమాలు ఛానెల్ లో మార్చి 24, రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మాతంగి హంగామా మొదలుకానుంది.

ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు పీడకలలు వస్తుంటాయి. త్వరలో తన కుటుంబం నాశనమై పోతుందనే సంకేతాలు అందుతుంటాయి. భయంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, ఒక బాబాని కలుసుకుంటాడు ఆ వ్యాపారవేత్త. అతను నివసిస్తున్న బంగ్లాలో మాతంగి అనే ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. అసలు మాతంగి ఎవరు..? దానికి ఆ వ్యాపారికి ఉన్న సంబంధమేంటి..? తెలుసుకోవాలంటే జీ సినిమాలు చూడాల్సిందే.

 

రీసెంట్ గా జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్ కూడా లాంఛ్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మాతంగిని హెచ్ డీ క్వాలిటీలో కూడా చూసి ఎంజాయ్ చేయండి.