ఏప్రిల్ 12 నుండి నాగశౌర్య నర్తనశాల

Friday,March 23,2018 - 11:46 by Z_CLU

నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘ఛలో’ సూపర్ సక్సెసయింది. ఈ సినిమా తరవాత రీసెంట్ గా ఉగాది రోజున ‘నర్తనశాల’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమాని లాంచ్ చేశాడు నాగశౌర్య. డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి సెట్స్ పైకి రానుంది.

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, సినిమాలోని తక్కిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ అఫీషియల్ గా కన్ఫం చేయలేదు కానీ, రీసెంట్ గా రిలీజైన ‘కిరాక్ పార్టీ’ ఫేమ్ సిమ్రాన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక మ్యూజిక్ విషయానికొస్తే ‘ఛలో’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాగర్ మహతి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడు.