#FriendshipDay : జీ సినిమాలు స్పెషల్

Friday,July 31,2020 - 11:54 by Z_CLU

టాలీవుడ్ లో తమ స్నేహబంధం తో కొనసాగుతున్నారు కొందరు హీరో లు, ప్రభాస్-గోపీచంద్, రామ్ చరణ్-రానా, రామ్ చరణ్-శర్వానంద్  ఈ కోవకి చెందిన వారే. టాలీవుడ్ లో ఇలా హీరో ల మధ్యే కాదు ప్రస్తుతం హీరో-హీరోయిన్ మధ్య కూడా ఈ ఫ్రెండ్ షిప్ కొనసాగుతుంది. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్న   ఆ హీరో-హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

ntr-kajal-aggarwal-dn3x2
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాలంటే ఎన్.టి.ఆర్- కాజల్ గురించే. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘బృందావనం’. ఈ సినిమాతో కాజల్-తారక్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ చిత్రం తరువాత ‘బాద్ షా’ లోను కలిసి నటించారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. కాజల్ ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చింది. తాజాగా కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ తన ఫ్రెండ్ తారక్ కోసమే ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.

prabhas-and-anushka-shetty
ఈ కోవలోకే వస్తారు ప్రభాస్-అనుష్క. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా బిల్లా. ఈ సినిమాతోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ సినిమా తరువాత ‘మిర్చి’ తో కనువిందు చేసిన ప్రభాస్-అనుష్క తాజాగా బాహుబలి సినిమాలో కూడా అలరించారు.

bunny-cetherine

బన్నీ- కేథరీన్ కూడా మంచి ఫ్రెండ్సే. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ సరసన నటించిన ఈ భామ అప్పటి నుండే స్టైలిష్ స్టార్ కు దోస్త్ అయిపోయింది. సరైనోడులో కూడా బన్నీ సరసన క్యాథరీన్ నటించింది.

rana-and-trisha1

వీరందరూ సినిమాల ద్వారా స్నేహితులుగా మారగా కలిసి నటించకుండానే ఫ్రెండ్స్ అయిపోయారు రానా-త్రిష. తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ తన బాండింగ్ ను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ టైం దొరికితే కలుసుకుంటారు.

రామ్ చరణ్-కాజల్ మధ్య కూడాా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించడానికి కాజల్ ఒప్పుకుందంటే దానికి కారణం రామ్ చరణ్ మాత్రమే. అంతకంటే ముందు చిరు నటించిన ఖైదీనంబర్ 150లో కూడా కాజల్ నటించడానికి చెర్రీతో ఫ్రెండ్ షిప్పే కారణం.

ఇలా టాలీవుడ్ లో హీరో-హీరోయిన్స్ మధ్య మంచి స్నేహబంధమే కొనసాగుతోంది. మంచు మనోజ్-తాప్సి, అల్లరినరేష్-శ్రద్ధాదాస్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.