కబాలి వీడియో హల్ చల్ 

Thursday,July 21,2016 - 04:04 by Z_CLU

సూపర్ స్టార్ రజని నటించిన ‘కబాలి’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అయితే నిన్న విదేశాల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అప్పుడే ఈ చిత్రంలోని రజని ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని ఎవరో ఓ వ్యక్తి మొబైల్ లో బంధించి సోషల్ మీడియా లో పెట్టడం తో ఆ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇక ఎన్నో అంచనాలతో  విడుదలకాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఇలా దర్శనమివ్వడం తో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రజని అభిమానులు. దయచేసి ఈ వీడియో ను  షేర్ చెయ్యకండి… పెట్టిన వాళ్ళు అర్జెంట్ గా తీసెయ్యండి అంటూ సోషల్ మీడియా లో వారి పై  కామెంట్స్ చేస్తున్నారు. రేపు వెండితెర పై చూసి ఆనందించాల్సిన సన్నివేశాల్ని ఇలా పెట్టడం న్యాయమా? అంటూ పెట్టిన వారిని ఘాటు గానే ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.