తండ్రి కాబోతున్న అల్లు అర్జున్

Thursday,July 21,2016 - 04:10 by Z_CLU

అల్లు వారింట మరో సంబరం రానుంది. బన్నీ త్వరలోనే మరోసారి తండ్రి కాబోతున్నాడు. తన భార్య స్నేహారెడ్డి ప్రస్తుతం గర్భవతి అనే విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు. తన కొడుకు అయాన్ కు త్వరలోనే తమ్ముడు లేదా చెల్లెలు రాబోతోందని బన్నీ ట్విట్టర్ లో ప్రకటించాడు. అంతేకాదు… స్వయంగా తనే ఒక ఫొటోను కూడా విడుదల చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మెగా కాంపౌండ్ కు చెందిన కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. తమ నక్షత్రం, రాశికి తగ్గ మొక్క నాటారు. ఇందులో భాగంగా స్నేహారెడ్డి కూడా మీడియా ముందుకొచ్చింది. అప్పుడే ఆమెను చూసిన మీడియా ప్రతినిధులు… స్నేహారెడ్డి మరోసారి తల్లికాబోతోందంటూ వార్తలు రాశారు. ఇప్పుడా విషయాన్ని బన్నీ అధికారికంగా ప్రకటించాడు.