ప్లాన్ చేంజ్ .... తమిళ్ లో కమల్, తెలుగులో మహేష్ !

Thursday,November 07,2019 - 01:15 by Z_CLU

ఈ రోజు సాయంత్రం నుండి మోషన్ పోస్టర్ తో ‘దర్బార్’ హంగామా మొదలు కానుంది. సాయంత్రం సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు మోషన్ పోస్టర్ ను నాలుగు భాషల్లో రిలీజ్ కి ఏర్పాట్లు చేశారు. నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా మోషన్ పోస్టర్ ను విడుదల చేసి సినిమాను ప్రమోట్ చేయనున్నారు.

‘దర్బార్’ కి హిందీ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తుండగా మలయాళ మోషన్ పోస్టర్ ను మోహన్ లాల్ రిలీజ్ చేయనున్నారు. అయితే నిన్న సాయంత్రమే నాలుగు భాషల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీ ఇచ్చిన మేకర్స్ తమిళ్, తెలుగుకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కమల్ హాసన్ విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే తమిళ్ లో కమల్ లాంచ్ చేయడం ఒకే కానీ తెలుగులో చిరు లేదా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ లాంచ్ చేస్తే బాగుండేది కదా అనే ఫీడ్ బ్యాక్ మేకర్స్ కి రీచ్ అయ్యింది.

అందుకే వెంటనే ప్లాన్ మార్చుకున్నారు మేకర్స్. ఫైనల్ గా ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతున్నాడు.  సో  సాయంత్రం నలుగురు స్టార్ హీరోలు రజినీ సినిమాను తమ ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో జనాలల్లోకి తీసుకెళ్లనున్నారన్నమాట.