కబాలి టికెట్స్ కోసం చెన్నై లో నిరసన..

Thursday,July 21,2016 - 06:29 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కబాలి’. రంజిత్ దర్శకత్వం లో కలై పులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (రేపు) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా టికెట్స్ గురించి చెన్నై లో కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రజని అభిమానులు. ఇప్పటికే అన్ని థియేటర్స్ వద్ద దాదాపు ఓ రెండు వారాల పాటు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పెట్టేసారు థియేటర్స్ యాజమాన్యం. ఇక చెన్నై లో ఈ సినిమా టికెట్ ను 600 రూ. అమ్ముతున్నారని… అసలు తమిళ నాడులో 120 రూపాయలకే టికెట్ అమ్మాల్సి ఉండగా ఇంత ధర పెట్టి అమ్మడం పై కొందరు అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక వారం ముందే కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు ఈ చిత్ర టికెట్స్ ను అడ్వాన్స్ గా బుక్ చేసేసుకోవడంతో…. టికెట్స్ దొరకని రజని ఫాన్స్ వారి పై తెగ మండిపడుతున్నారట. ఒక్క చెన్నై లోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా కబాలి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర విడుదల సందర్భంగా బెంగళూర్ తో పాటు చెన్నైలోని కొన్ని ప్రయివేట్ కంపెనీలకు సెలవులు ప్రకటించడంతో అందరూ ఒకేసారి కబాలి చూసేందుకు ఎగబడుతున్నారు.