హాట్ టాపిక్ : రజినీ సినిమాలో మ్యాచో హీరో

Saturday,March 07,2020 - 11:13 by Z_CLU

రజినీకాంత్ సినిమాలో గోపీచంద్ ఓ కీ రోల్ చేయనున్నాడు… ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజినీ కాంత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సినిమాలో ఓ కీ రోల్ ను ఎవరైనా హీరోతో చేయిస్తే బాగుంటుందనే డిస్కషన్ నడిచిందట. సరిగ్గా అప్పుడే దర్శకుడు శివ, గోపీచంద్ అయితే బాగుంటుందని రజినీ దగ్గర ప్రస్తావన తెచ్చాడట.

ఇక గోపీచంద్ పేరు వినగానే సూపర్ స్టార్ వెంటనే ఒకే అన్నారట. నిజానికి ఈ వార్తలో నిజం లేకపోలేదు. దర్శకుడు శివ, గోపీచంద్ మధ్య మంచి రిలేషన్ ఉంది. గోపీచంద్ తోనే మొదటి సినిమా చేసాడు శివ.  రెండో సినిమా కూడా ఈ హీరోతోనే తీశాడు. అందుకే ప్రస్తుతం రజినీ సినిమాలో గోపీచంద్ తో తను అనుకుంటున్న క్యారెక్టర్ చేయించాలని భావిస్తున్నాడట. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. అప్పటి వరకూ ఇది హాట్ టాపిక్కే.