హాట్ టాపిక్ : మహేష్ తో వెంకీ ?

Monday,March 16,2020 - 01:52 by Z_CLU

నెలలు గడుస్తున్నా మహేష్ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయకపోవడంతో రకరకాల గాసిప్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు చిరంజీవి సినిమాలో మహేష్ లేడంటూ వార్త వినిపిస్తుంటే మరో వైపు మహేష్ నెక్స్ట్ సినిమా పరశురాంతోనే అంటూ టాక్ వినబడుతుంది. ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి కి మహేష్ నో చెప్పలేదని ప్రాజెక్ట్ ఇంకా డిస్కర్షన్ స్టేజిలో ఉందని అంటున్నారు.

ఇలా మహేష్ నెక్స్ట్ సినిమా గురించి వరుస వార్తలు చక్కర్లు కొడుతుంటే లేటెస్ట్ గా మరో న్యూస్ బయటికొచ్చింది. ఇటివలే ‘భీష్మ’తో మరో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల సూపర్ స్టార్ తో తన మూడు సినిమా చేస్తాడనేది ఆ న్యూస్. ఇది ఎంత వరకూ నిజం అన్నది పక్కన పెడితే అసలు ఈ వార్త ఎలా పుట్టిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అవును ఈ కాంబో వార్త ఎలా పుట్టింది..? నిజంగానే వెంకీ మహేష్ కి కథ చెప్పాడా ? అనే ప్రశ్నలు సూపర్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొనేలా చేస్తున్నాయి.

ప్రస్తుతానికయితే ఈ కాంబో సినిమా జస్ట్ గాసిప్ గానే ఉంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మహేష్ నుండి అనౌన్స్ మెంట్ రావాల్సిందే. అప్పటి వరకూ ఇందులో నిజమెంత అనేది తెలియదు.