SarkaruVaariPaata షూటింగ్ అప్ డేట్స్

Tuesday,April 06,2021 - 04:12 by Z_CLU

దుబాయ్ లో మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కి సంబంధించి రెండో షెడ్యుల్ మొదలవుతోంది. దుబాయ్ లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ  యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేసిన యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నారు.

రెండో షెడ్యుల్ ని ముందుగా అమెరికాలో ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్లాన్ మార్చుకొని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. సిటీ శివారులో ఇప్పటికే భారీ సెట్ కూడా రెడీ చేశారు. ఈ సెట్ లో దాదాపు ఇరవై రోజుల పాటు మహేష్ మిగతా నటులపై సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల 15 నుండి షెడ్యుల్  ప్రారంభం కానుందని సమాచారం.

‘గీత గోవిందం’ తర్వాత పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఎనౌన్స్ చేసిన టైటిల్ , విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో ప్రేక్షకులను కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ సరసన కీర్తి suresh హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

Also Read VakeelSaab – హైదరాబాద్ లోనే 100 స్క్రీన్స్

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics