జాహ్నవి కపూర్ ‘ధడక్’ గ్రాండ్ సక్సెస్

Monday,August 06,2018 - 06:01 by Z_CLU

జాహ్నవి కపూర్ డెబ్యూ మూవీ ‘ధడక్’ గ్రాండ్ సక్సెస్ అయింది. మరాఠి బ్లాక్ బస్టర్ ‘సైరత్’  కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా థర్డ్ వీక్ కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. సెకండ్ వీక్ కూడా కంప్లీట్ అవ్వకముందే ఏకంగా 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, జాహ్నవి కపూర్ ని సక్సెస్ ఫుల్ డెబ్యూ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసింది.

ఇండియాలో జూలై 20 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ‘ధడక్’ ఇండియాలో 2,235  స్క్రీన్స్ లో రిలీజైతే 556 స్క్రీన్స్ ఓవర్ సీస్ లో రిలీజయింది. సినిమా రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన హైప్ కి తగ్గట్టు, సినిమా అటు మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ మెస్మరైజ్ చేయడం సినిమాని సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టింది. ఫస్ట్ వీకెండ్ కే కలెక్షన్స్ పరంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, మరియు UK దేశాల్లో టాప్ 10 లిస్టులో చేరింది   ‘ధడక్’.

 

శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని జీ స్టూడియోస్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.  అజయ్ అతుల్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.