జాహ్నవి కపూర్ ‘ధడక్’ ట్రైలర్ రిలీజయింది

Monday,June 11,2018 - 02:31 by Z_CLU

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించిన ‘ధడక్’ సినిమా ట్రైలర్ రిలీజయింది. ఈ రోజు ముంబై లో ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మరాఠి బ్లాక్ బస్టర్ ‘సైరత్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓవరాల్ గా భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

ట్రైలర్ ని బట్టి ఫస్ట్ సినిమానే అయినా జాహ్నవి కపూర్ మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేసిందనిపిస్తుంది. దానికి తోడు ఇషాన్ ఖైతాన్ ఇన్నోసెంట్ కుర్రాడిలా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ ని బట్టి సినిమా సక్సెస్ గ్యారంటీ అనిపిస్తుంది.

ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అతుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జూలై 20 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది.