జాహ్నవి కపూర్ ఇంటర్వ్యూ

Thursday,June 21,2018 - 10:03 by Z_CLU

జూలై 20 న గ్రాండ్ గా రిలీజవుతుంది జాహ్నవి కపూర్ ‘ధడక్’. శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, అందరినీ ఇంప్రెస్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవరాల్ గా వచ్చిన రెస్పాన్స్ గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ చేసుకుంది జాహ్నవి కపూర్. అవి మీకోసం…

సినిమా చూశాక అభిప్రాయం మారవచ్చు…

ట్రైలర్ రిలీజయ్యాక చాలా మంది అప్రీషియేట్ చేశారు.. ఇక ట్రైలర్ నచ్చని వారికి,  సినిమా చూశాక అభిప్రాయం మారవచ్చు.

నాకు తెలిసింది అదొక్కటే…

నాకు అందరి ప్రేమ కావాలి. అందుకు నేను చేయాల్సిందల్లా.. కష్టపడి పనిచేయడం. ఏదో ఒకరోజు నేను అందరి మనసు గెలుచుకుంటాను.

కంప్లీట్ రెండేళ్ళు…

లాస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ గా ధడక్ చుట్టూ ఉంది లైఫ్. ప్రతి క్షణం సినిమాలో మా క్యారెక్టర్స్ (పార్థవి & మధుకర్) చుట్టూరా ఉండేది ఆలోచనంతా… సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా ఎగ్జైటెడ్ గా ఉంది.

బెస్ట్ కాంప్లిమెంట్…

ఒక డైరెక్టర్ కాల్ చేసి ‘నీలో నీ డిఫెరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకునే సత్తా ఉంది..’ అని చెప్పారు. చాలా హ్యాప్పీగా అనిపించింది.

 

అది కూడా గొప్పతనమే…

ఎవరైనా మన పర్ఫామెన్స్ చూసి నెగెటివ్ గా రెస్పాండ్ అయినా నేను పెద్దగా బాధపడను, ఒకరి మనల్ని క్రిటిసైజ్ చేయడానికైనా మనకోసం కొద్దో గొప్పో టైమ్ కేటాయిస్తారు. అది కూడా గొప్పే.. వాళ్ళను కూడా మెప్పించే స్థాయికి ఎదగాలి.

ట్రైలర్ లాంచ్ రోజు…

ట్రైలర్ లాంచ్ చేసిన రోజు ఖుషి చాలా ఇమోషనల్ అయి ఏడ్చేసింది. తనని ఏడుస్తూ చూడటం చాలా రేర్.

అమ్మ చెప్పింది…

అమ్మ ఒక్కటే చెప్పేది… మంచి యాక్టర్ అవ్వాలంటే ముందు మంచి మనిషివి అవ్వాలి. కెమెరా దేన్నైనా ఈజీగా పసి గట్టేస్తుంది. మనం ఎంత నటించినా కెమెరా మనం ఎలాంటి వాళ్ళమో బయట పెట్టేస్తుంది.