కూతురు సినిమాలో నటించనున్న శ్రీదేవి

Friday,November 17,2017 - 07:20 by Z_CLU

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ డెబ్యూ మూవీ ‘ధడక్’ లాంచ్ అయినప్పటి నుండి బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను ఇంట్రెస్టింగ్ క్రేజ్ క్రియేట్ అవుతుంది. మరాఠి సెన్సేషనల్ హిట్ ‘సైరత్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో జాహ్నవి కపూర్ తో పాటు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కతార్ సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.  అయితే ఈ సినిమాలో శ్రీదేవి కామియో రోల్ లో కనిపించనుందనే టాక్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

 

 

‘ధడక్’ సినిమాలో శ్రీదేవి నటిస్తుందన్న న్యూస్ అఫీషియల్ గా కన్ఫం అయితే కాలేదు కానీ, ఒరిజినల్ సైరత్ మూవీ స్క్రిప్ట్ లో శ్రీదేవి రేంజ్ కి తగ్గ క్యారెక్టర్ లేకపోయినా, ఈ సినిమా నిర్మాత కరణ్ జోహర్ పర్టికులర్ గా శ్రీదేవి కోసం సినిమాలో స్పేస్ క్రియేట్ చేస్తున్నాడనే టాక్ బాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ డైరెక్టర్.