ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేసిన జాహ్నవి కపూర్

Wednesday,July 18,2018 - 11:08 by Z_CLU

ప్రస్తుతం ‘ధడక్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది జాహ్నవి కపూర్. ఈ నెల 20 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. తన ఫస్ట్ సినిమాతోనే ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తన గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకుంది.

నటనే కాకుండా తనకు స్టోరీస్ రాయడం అన్నా చాలా ఇష్టమని చెప్పుకుంది. కాత టైమ్ దొరికినా స్టోరీస్ రాసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తానని చెప్పుకున్న జాహ్నవి, ఆ స్టోరీస్ కి సంబంధించి మరిన్ని వివరాలను కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు రివీల్ చేస్తానని చెప్పుకుంది. దాంతో జాహ్నవి కి ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే ఆలోచనేమైనా ఉందా..? అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి.

స్టోరీస్ రాసే అలవాటును జస్ట్ హాబీగా సరిపెట్టుకుంటుందా..? లేకపోతే జాహ్నవి ఈ స్టోరీస్ తో ఏం చేయబోతుంది..? అనే క్వశ్చన్స్ ని కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతానికి తన డెబ్యూ మూవీ ‘ధడక్’ ని వైడెస్ట్ రేంజ్ లో రీచ్ అయ్యేలా సినిమాని ప్రమోట్ చేస్తుంది జాహ్నవి. ప్రస్తుతానికి తన కంప్లీట్ కాన్సంట్రేషన్ ‘ధడక్’ పై ఉందని చెప్పుకున్న జాహ్నవి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుందని చెప్పుకుంది.