NTR అరవింద సమేత లేటెస్ట్ అప్డేట్స్

Monday,August 06,2018 - 06:32 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది NTR అరవింద సమేత. త్రివిక్రమ్ మార్క్ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా NTR ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, ఆ తరవాత కంప్లీట్ కాన్సంట్రేషన్ షూటింగ్ పైనే ఫిక్స్ చేశారు ఫిలిమ్  మేకర్స్.

రీసెంట్ గా రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫిలిం మేకర్స్, ఏ  మాత్రం గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్ గా నెక్స్ట్ షెడ్యూల్ కి మూవ్ అయ్యారు. ప్రస్తుతం పోచంపల్లికి సమీపంలో ఉన్న ఊళ్ళో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.