జెర్సీ – నాని కరియర్ బెస్ట్ పర్ఫామెన్స్

Friday,April 19,2019 - 12:36 by Z_CLU

‘నాని రేంజ్ కి తగ్గ సినిమా ‘జెర్సీ’…’ ఇది జెర్సీ టీమ్ ప్రమోషన్స్ లో చెప్పిన మాట కాదు. సినిమా రిలీజవ్వగానే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మాట. నాని పర్ఫామెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాని లోని రియల్ న్యాచురల్ స్టార్ ని 100% ఎలివేట్ చేసింది ‘జెర్సీ’.

నాని ప్రతి సినిమా స్పెషలే. కానీ ‘జెర్సీ’ లో మాత్రం కరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కన్న కలని సాకారం చేసుకోవాలని స్ట్రగుల్ అయ్యే అర్జున్ ని తప్ప నాని కనిపించట్లేదు. అంతలా క్యారెక్టర్ లో ఒదిగిపోయి పర్ఫామ్ చేశాడు న్యాచురల్ స్టార్. మరీ ముఖ్యంగా సినిమాలో రైల్వే స్టేషన్ సీక్వెన్స్ లో చూస్తున్నది సినిమా అని కూడా మర్చిపోయి రియల్ టైమ్ ఎమోషన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు ఆడియెన్స్.

స్క్రీన్ పై సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యే అర్జున్ కి, 23 సినిమాల సక్సెస్ ఫుల్ కరియర్ లో అవకాశం దొరకాలి తనలోని కంప్లీట్ నటుణ్ణి బయటపెట్టాలని తపన పడే నానిలో పెద్ద తేడా లేదు అంటున్నారు ఫ్యాన్స్. ‘జెర్సీ’ జస్ట్ అర్జున్ కథ కాదు… సక్సెస్ కోసం నెవర్ గివప్ ఆటిట్యూడ్ తో ప్రయత్నించే ప్రతి ఒకరి కథ అనిపించుకుంటుంది. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది జెర్సీ.