బాలీవుడ్ లో రీమేక్ కానున్న తెలుగు సినిమాలు

Saturday,August 03,2019 - 10:02 by Z_CLU

బాలీవుడ్ లో తెలుగు రీమేక్స్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. కొంచెం నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ కావాలి కానీ, తెలుగులో సక్సెస్ అయిన ప్రతి సినిమా బాలీవుడ్ లో కూడా అంతే గ్రాండ్ సక్సెస్ అందుకుంటుంది. రీసెంట్ గా ‘కబీర్ సింగ్’ సక్సెస్ తరవాత ఈ వరసలో ‘ప్రస్తానం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా తరవాత మరిన్ని రీమేక్స్ బాలీవుడ్ లో సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉన్నాయి.

ప్రస్థానం : ఈ సినిమాకి హిందీలో కూడా అదే టైటిల్ ఫిక్సయ్యారు మేకర్స్. తెలుగులో ఈ సినిమాకి దేవకట్ట డైరెక్టర్. హిందీలో కూడా ఆయనే డైరెక్టర్. సంజయ్ దత్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

F2 : నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి నిర్మించబోతున్న సినిమా ఇది. టైటిల్, సినిమాలో నటించబోయే స్టార్స్ డీటేల్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, F2 లాంటి సబ్జెక్ట్ ఏ భాషలో తెరకెక్కించినా సక్సెస్ అవ్వడం ఖాయం.

జెర్సీ : తెలుగులో నాని నటించిన సినిమా ఇది. ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా బాలీవుడ్ లో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది.

ఎవడు : హిందీలో ఈ సినిమాని నిఖిల్ అద్వానీ దర్శకత్వం చేయబోతున్నాడు. నిర్మాత మాత్రం దిల్ రాజునే. ఇంకా అఫీషియల్ గా బయటికి రాలేదు. ఈ సినిమాతో బాలీవుడ్  బడా స్టార్స్ ని సెట్స్ పైకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు మేకర్స్. రేపో మాపో అన్నీ డీటేల్స్ అఫీషియల్ గా కన్ఫమ్ అవుతాయి.

ఖైదీ నం 150 : హిందీలో మెగాస్టార్ ప్లేస్ లో అక్షి కుమార్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి ‘ఇక్కా’ అని టైటిల్ ని కూడా ఫిక్సయ్యారు మేకర్స్. త్వరలో సెట్స్ పైకి రాబోతుంది ఈ సినిమా.

డియర్ కామ్రేడ్ : రిలీజ్ కి ముందే ఈ సినిమా రీమేక్ కన్ఫమ్ అయింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రిలీజ్ కి ముందే సినిమా చూసి, కాన్ఫిడెంట్ గా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.  అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం ఇది రెండోసారి.