గ్రాండ్ గా రిలీజైన ‘జెర్సీ’

Friday,April 19,2019 - 10:30 by Z_CLU

గ్రాండ్ గా రిలీజయింది ‘జెర్సీ’. సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ హడావిడి బిగిన్ అయిపోయింది. భారీ అంచనాల మధ్య గత 2 వారాలుగా అగ్రెసివ్ ప్రమోషన్స్ తో సినిమాని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేసిన మేకర్స్, ఆల్మోస్ట్ అంచనాలను రీచ్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

నాని కరియర్ లోనే బెస్ట్ గా నిలవనుంది జెర్సీ. ఈ సినిమా కోసం స్పెషల్ గా క్రికెట్ నేర్చుకున్నాడు. కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఫాదర్ గా నటించాడు. తన 36 వ ఏట తను నమ్ముకున్న క్రికెట్ లోనే మళ్ళీ సక్సెస్ అందుకోవడానికి స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్ లో, కంప్లీట్ గా ఎమోషనల్ ఆంగిల్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు నాని.

గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కింది ఈ సినిమా. శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది.  అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.