శ్రద్ధా శ్రీనాథ్ సెటిలయినట్టే

Thursday,April 25,2019 - 11:03 by Z_CLU

టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు. కానీ నిలబడగలిగేది మాత్రం కొందరే. ‘జెర్సీ’ సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ విషయంలో కూడా మొదట్లో క్లారిటీ రాలేదు. నాని సినిమాలతో ఎంత మంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ కాలేదు…? ఆ అకౌంట్ లో ఇంకో హీరోయిన్ అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరవాత స్టోరీ మారిపోయింది.

‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్ ప్లే చేసిన క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే అల్టిమేట్ గా ఒక స్టోరీ చెప్పినంత టైమ్ పడుతుంది. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అది. ఈ అమ్మడుకి కలిసొచ్చింది ఎక్కడంటే మొదటి సినిమాలో డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించే అవకాశం దొరకడం. దానికి తోడు ఎమోషనల్ కనెక్టివిటీ ఉండటంతో, జస్ట్ గ్లామరస్ హీరోయిన్ కి క్రియేట్ అయ్యే క్రేజ్ తరహాలో కాకుండా, రియల్ గా కూడా ఆడియెన్స్ కి చాలా దగ్గరైంది శ్రద్ధా శ్రీనాథ్.

తెలుగులో రెండు సినిమాలకు సంతకం చేసిన శ్రద్ధా, ప్రస్తుతం వరస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరవుతుంది. కన్నడ, తమిళ సినిమాల్లో ఆల్రెడీ బిజీ అయిన ఈ బ్యూటీ, తెలుగులో కూడా అదే స్థాయికి చేరాలని ఆరాటపడుతుంది.

పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండాలి కానీ ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్లే చేయడానికి రెడీ అని చెప్తున్న శ్రద్ధా ఇదే ఊపులో స్టార్ హీరోస్ దృష్టిలో కూడా పడిందంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.