జెర్సీ చూసాను ..చాలా బాగుంది !

Thursday,April 25,2019 - 09:02 by Z_CLU

మొన్న శుక్రవారం ‘జెర్సీ’ తో పాటు లారెన్స్ నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంచన 3’ కూడా థియేటర్స్ లోకొచ్చింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘జెర్సీ’తో పాటు ‘కాంచన 3’ కూడా తెలుగు స్టేట్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ వేదికపై ‘జెర్సీ’ సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు లారెన్స్.

లారెన్స్ మాట్లాడుతూ ” జెర్సీ సినిమా చూశాను. చాలా బాగుంది. ఒక జీవితాన్ని చూపించారు. దయచేసి అందరూ ఆ సినిమాను చూడాలి. హీరో బాగా చేశారు. ఆ డైరెక్టర్ సూపర్బ్ గా డైరెక్ట్ చేసారు. ఈ రెండు సినిమాలు ఇంకా బాగా ఆడాలని, మాకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆ రాఘవేంద్రస్వామిని కోరుకుంటున్నాను ” అని అన్నారు.