‘హిప్పీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,April 19,2019 - 02:16 by Z_CLU

RX 100 హీరో సెకండ్ మూవీ ‘హిప్పీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రతుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూన్ 7 న థియేటర్స్ లోకి రానుంది హిప్పీ మూవీ. RX 100 తో యూత్ కి దగ్గరైన కార్తికేయ ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈ సినిమా స్టోరీలైన్ ఇంకా రివీల్ కాలేదు కానీ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కార్తికేయ లుక్ విషయంలో కూడా స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నాడు. RX 100 తో యూత్ కి దగ్గరైన కార్తికేయ, ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా దగ్గర కానున్నాడు. J.D. చక్రవర్తి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు.

T.N. కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది హిప్పీ. నివాస్.K. ప్రసన్న మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో దిగంగన హీరోయిన్ గా నటించింది. V. క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.