జై లవకుశ సినిమాకి విలన్ ఫిక్సయ్యాడు

Thursday,June 22,2017 - 04:40 by Z_CLU

జై లవకుశ సినిమా షూటింగ్ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని స్టోన్ క్వారీ భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్.

ఉడాన్, అగ్లీ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన రోనిత్ ‘జై లవకుశ’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ముందుగా ఈ క్యారెక్టర్ కి కన్నడ నటుడు దునియా విజయ్ ని అనుకున్నా, చివరికి రోనిత్ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్.