మరో మూడు రోజుల్లో...

Monday,July 03,2017 - 11:34 by Z_CLU

జై లవకుశ టీజర్ రిలీజ్ కి రెడీ గా ఉంది. జూలై 6 న రిలీజ్ కానున్న ఈ టీజర్ ఆల్ రెడీ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం బిగిన్ చేసేసింది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR, 3 డిఫెరెంట్ గెటప్స్ లలో కనిపించడం ఒక ఎత్తైతే, ఇందులో ఒక క్యారెక్టర్ కోసం ఏకంగా హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వ్యాన్స్ హార్ట్ వెల్ ఈ క్యారెక్టర్ లుక్ డిజైన్ చేయడం, న్యాచురల్ గానే సినిమా పై క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాన్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్ గా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 21 న రిలీజ్ డేట్  ఫిక్స్ చేసుకున్న  ఈ సినిమాకి  DSP మ్యూజిక్ కంపోజ్ చేశాడు.