NTR మూవీ అప్ డేట్స్

Wednesday,June 07,2017 - 05:07 by Z_CLU

NTR జై లవకుశ ఫుల్ స్వింగ్ లో ఉంది. బాబీ డైరెక్షన్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్, ఈ మంత్ ఎండ్ వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.

ఈ షెడ్యూల్ తరవాత ఆగష్టు 2 నుండి ఏకంగా 20 రోజుల భారీ షెడ్యూల్ ని డిజైన్ చేసుకున్న సినిమా యూనిట్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో పక్కా ప్లానింగ్ లో ఉన్న ‘జై లవకుశ’ టీమ్, సెప్టెంబర్ లాస్ట్ వీక్ కల్లా సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.