జై లవకుశ ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్

Wednesday,June 14,2017 - 02:29 by Z_CLU

NTR జై లవకుశ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సైలెంట్ గానే బోలెడంత క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది. ఈ NTR మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించడం ఒక ఎత్తైతే, అందులో ఒక క్యారెక్టర్ లో NTR విలన్ షేడ్స్ లో ఎట్రాక్ట్ చేయబోతున్నాడన్న న్యూస్, టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. దానికి తోడు ఈ మధ్య మరో ఇంటరెస్టింగ్ క్వశ్చన్ ఈ స్పేస్ ని అక్యుపై చేసింది.

ఇంతకీ జై లవకుశ లో ఐటమ్ సాంగ్ ఉంటుందా..? ఇప్పుడీ టాపిక్ ఫ్యాన్స్ లో హాట్ హాట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇతకీ ఐటమ్ సాంగ్ లో మెస్మరైజ్ చేయనున్న హాట్టెస్ట్ స్టార్ హీరోయిన్ ఎవరు..? జనతా గ్యారేజ్ లో కాజల్ ని ప్రిఫర్ చేసిన NTR ఈ సారి ఏ హీరోయిన్ ని ప్రిఫర్ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న మిలియన్ డాలర్ క్వశ్చన్.

ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ తప్ప ఇంకో ధ్యాసే లేకుండా ఉన్న సినిమా యూనిట్, ఫస్ట్ లుక్ తరవాత ఈ సినిమా విషయంలో ఎటువంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ సినిమాపై ఈ రేంజ్ లో క్యూరాసిటీ పెరగడానికి ఈ సైలెన్స్ కూడా ఓ రీజన్ అయిందనే చెప్పాలి. ఏది ఏమైనా జై లవకుశ ఐటమ్ సాంగ్ పై క్లారిటీ రావాలంటే సినిమా యూనిట్ ఈ విషయంలో ఏదైనా అనౌన్స్ చేయాలి లేకపోతే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.