DJ తో పాటే ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రేలర్

Thursday,June 22,2017 - 04:08 by Z_CLU

రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ హంగామా బిగిన్ అయింది. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మోస్ట్ అవేటింగ్ ఎంటర్ టైనర్ ట్రేలర్, రేపటి నుండి అల్లు అర్జున్ DJ సినిమాతో పాటు థియేటర్స్ లో సందడి చేయనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ లా కనిపించనున్నాడు.

రానా కరియర్ లో బాహుబలి లాంటి బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ తర్వాత ఇమ్మీడియట్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై న్యాచురల్ గానే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్ కి కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.