శ్రీదేవి కూతురు జాహ్నవి గ్రాండ్ ఎంట్రీకి ఆల్ సెట్

Thursday,June 22,2017 - 06:05 by Z_CLU

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 300 సినిమాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవికి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో కూతురు జాహ్నవి సినిమా డెబ్యూ విషయంలోనూ అంతే క్రేజ్ క్రియేట్ అయి ఉంది. అయితే ఆ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ, బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది జాహ్నవి కపూర్.

మరాఠిలో కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సైరత్’ రీమేక్ రైట్స్  ని దక్కించుకున్న కరణ్ జోహార్ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది జాహ్నవి. హిందీలో శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో  హీరోయిన్ గా నటించనుంది జాహ్నవి. ఇక షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కూడా ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

మరాఠి సైరత్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అజయ్-అతుల్ హిందీ వర్షన్ కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మరాఠిలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా హిందీలోను అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.