ఇస్మార్ట్ శంకర్.. మరో మైల్ స్టోన్

Monday,August 19,2019 - 12:39 by Z_CLU

రిలీజై నెల రోజులైనా ఇస్మార్ట్ హంగామా ఇంకా తగ్గలేదు. ఈ గ్యాప్ లో ఎన్ని సినిమాలొచ్చినా బి, సి సెంటర్లలో ఈ సినిమా జోష్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రతి రోజూ ఈ సినిమాకు షేర్స్ వస్తూనే ఉన్నాయి. అలా నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 40 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. అవును.. విడుదలైన ఈ 32 రోజుల్లో వరల్డ్ వైడ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 40 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగులో 40 కోట్ల షేర్ అనేది అతి తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యమైంది. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు మాత్రమే 40 కోట్ల షేర్ రాబట్టగలిగారు. ఆమధ్య గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ ఈ క్లబ్ లోకి చేరగలిగాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తొలిసారిగా ఈ క్లబ్ లోకి ఎంటరయ్యాడు హీరో రామ్.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నిన్నటి వసూళ్లతో కలుపుకొని 36 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ఈ సినిమా 82 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. తాజా వసూళ్లతో ఈ సినిమాకు అఫీషియల్ గా డబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్టయింది.

ఏపీ, నైజాం 32 రోజుల షేర్
నైజాం – రూ. 16.45 కోట్లు
సీడెడ్ – రూ. 5.98 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.71 కోట్లు
ఈస్ట్ – రూ. 2.26 కోట్లు
వెస్ట్ – రూ. 1.83 కోట్లు
గుంటూరు – రూ. 2.23 కోట్లు
నెల్లూరు – రూ. 1.20 కోట్లు
కృష్ణా – రూ. 2.14 కోట్లు