ఇస్మార్ట్ గా దూసుకుపోతున్న శంకర్

Saturday,August 03,2019 - 01:09 by Z_CLU

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. ఎన్ని సినిమాలొచ్చినా, ఎంతమంది పోటీ ఇచ్చినా ఈ సినిమా హవాను మాత్రం అడ్డుకోవడం ఎవ్వరి తరం కావడం లేదు.

విడుదలై 2 వారాలు పూర్తయినా, ఇప్పటికీ బి, సి సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ దే హంగామా అంతా. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఈ సినిమా చూడ్డానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా.

ఇక డొమస్టిక్ గా చూసుకుంటే.. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా ఇప్పటికే 30 కోట్ల రూపాయల షేర్ మార్క్ అందుకుంది. ఈ వీకెండ్ అదనంగా మరో 3 కోట్ల రూపాయల వసూళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బయ్యర్లు లాభాలు, నిర్మాతలు ఓవర్ ఫ్లోస్ ఎంజాయ్ చేస్తున్నారు.