ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడేమో

Monday,August 19,2019 - 12:08 by Z_CLU

నిన్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిలింసిటీలో ఘనంగా నిర్వహించారు. దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య ఈవెంట్ జరిగింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో పాటు స్టార్ డైరెక్టర్స్  రాజమౌళి, వినాయక్ అలాగే బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.  ఈ ఈవెంట్ లో సుజీత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు ప్రభాస్.

ప్రభాస్ మాట్లాడుతూ… ” ట్రైలర్ చూసారా నచ్చిందా..  ఫ్యాన్స్ , డై హార్డ్ ఫ్యాన్స్ అని రాసింది సుజీతే. తనకి మాస్ పల్స్ తెలుసు. 22 ఏళ్లకే సుజీత్ ‘రన్ రాజా రన్’ తీసాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత వంశీ , ప్రమోద్ లు సుజీత్ దగ్గర మంచి కథ ఉంది మేము విన్నాము. నువ్వు కూడా విని చెప్పు  అన్నారు. సుజీత్  నిక్కర్ వేసుకొచ్చి నాకు కథ చెప్పాడు.  44 ఏళ్ల దర్శకుడిలా కథను నెరేట్ చేసాడు.  కథ బాగా నచ్చడంతో సినిమా మొదలెట్టాం. దానికంటే ముందు తను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేశాడు.  ఇక ‘సాహో’ షూటింగ్ మొదలయ్యాక మధి , శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, కమల్ ఇలా అందరూ పెద్ద వాళ్ళే. వాళ్ళతో కలిసి చిన్న వయసున్న సుజీత్ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని కంగారు పడ్డాం. కానీ చాలా కూల్ గా హ్యాండిల్ చేసాడు. సుజీత్ బిగ్గెస్ట్ డైరెక్టర్. త్వరలోనే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడేమో అని డౌట్.”  అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.