ఇస్మార్ట్ శంకర్ లేటెస్ట్ కలెక్షన్

Saturday,July 27,2019 - 12:41 by Z_CLU

మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ దుమ్ముదులుపుతున్నాడు. ఆల్రెడీ నిర్మాతలతో పాటు బయ్యర్లంతా లాభాలు కళ్లజూస్తున్నారు. మరోవైపు విడుదలై వారం దాటినప్పటికీ శంకర్ హవా ఏమాత్రం తగ్గలేదు. నిన్నటితో 9 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ 9 రోజుల్లో వరల్డ్ వైడ్ 63 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.

కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది ఇస్మార్ట్ శంకర్. విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బి, సి సెంటర్లలో కచ్చితంగా క్లిక్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మల్టీప్లెక్సుల్లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది.

ట్రేడ్ అంచనా ప్రకారం.. కంప్లీట్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 75 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరవుతుందని ఆశిస్తున్నారు.