60 కోట్ల క్లబ్ లో చేరిన ఇస్మార్ట్ శంకర్

Friday,July 26,2019 - 03:28 by Z_CLU

విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు ఇస్మార్ట్ శంకర్. వారం రోజులు దాటినా ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. నిన్నటితో 8 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 60 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. అవును.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 61 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక కీలకమైన నైజాం విషయానికొస్తే, ఈ ఏరియాలో ఇస్మార్ట్ శంకర్ కు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికే 10 కోట్ల షేర్ క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా, నిన్నటి వసూళ్లతో కలుపుకొని 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ ఇది.

మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. రీసెంట్ గా సినిమా చూసిన చరణ్.. రామ్ యాక్టింగ్ తో పాటు పూరి డైరక్షన్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. యూనిట్ లో ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పాడు.

ఓవైపు రికార్డు కలెక్షన్లు వస్తున్నప్పటికీ యూనిట్ మాత్రం ప్రమోషన్ ఆపలేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్ని కవర్ చేసిన యూనిట్, నిన్న విశాఖ, కాకినాడలోని పలు థియేటర్లలో సందడి చేసింది.