రణరంగం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,August 19,2019 - 12:53 by Z_CLU

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న రణరంగం సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా నిన్నటితో 4 రోజుల రన్ పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 కోట్ల 66 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది రణరంగం సినిమా. ఇప్పటివరకు ఈ హీరో నటించిన ఏ సినిమాకూ ఇంత బజ్ రాలేదు. సంక్రాంతికొచ్చిన శతమానంభవతి, రీసెంట్ గా వచ్చిన పడిపడి లేచే మనసు సినిమాల కంటే ఈ మూవీకి ఫస్ట్ డే ఎక్కువ షేర్ వచ్చింది. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో వీకెండ్ వసూళ్లు కాస్త తగ్గాయి.

మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఇదే రేంజ్ లో మరో వారం రోజులు నడిస్తే.. సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. సుధీర్ వర్మ డైరక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. పీడీవీ ప్రసాద్ ప్రజెంట్ చేశారు.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (4 రోజుల) షేర్
నైజాం – రూ. 2.75 కోట్లు
సీడెడ్ – రూ. 1.23 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.10 కోట్లు
ఈస్ట్ – రూ. 0.51 కోట్లు
వెస్ట్ – రూ. 0.47 కోట్లు
గుంటూరు – రూ. 0.73 కోట్లు
నెల్లూరు – రూ. 0.32 కోట్లు
కృష్ణా – రూ. 0.55 కోట్లు