రేయ్ ఇస్మార్ట్.. నువ్వు తోపురా

Wednesday,July 24,2019 - 01:04 by Z_CLU

సినిమాలోని ఓ సాంగ్ లో స్వయంగా పూరి జగన్నాధ్ చెప్పిన డైలాగ్ ఇది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఈ డైలాగ్ ను మరోసారి రిపీట్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా. అవును.. డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ఇస్మార్ట్ శంకర్, కళ్లుచెదిరే వసూళ్లు సాధిస్తోంది.

వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ సినిమా.. వర్కింగ్ డేస్ లో కూడా తన జోరు తగ్గించలేదు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ సినిమాకు జనాలు పోటెత్తారు. అలా నిన్నటి వసూళ్లతో కలుపుకొని, విడుదలైన 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇస్మార్ట్ శంకర్.

 

బి, సి సెంటర్లకే పరిమితమౌతుందని భావించిన ఈ సినిమా, మల్టీప్లెక్సుల్లో కూడా హౌజ్ ఫుల్ షోజ్ తో నడుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు పూరి జగన్నాధ్ నమ్మకం నిజమైంది. సెంటర్స్ తో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడిలో మాస్ యాంగిల్ ఉంటుందని, ఇస్మార్ట్ శంకర్ తో అందరూ కనెక్ట్ అవుతారని పూరి అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.