సెప్టెంబర్ లో వస్తున్న వాల్మీకి

Wednesday,July 24,2019 - 12:36 by Z_CLU

మెగా హీరో వరుణ్ తేజ్, డైరక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా వాల్మీకి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 13న ఈ మూవీని వరల్డ్ వైడ్ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వస్తోంది వాల్మీకి. ఇందులో వరుణ్ తేజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అతడి సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరో కీలకమైన పాత్రను తమిళ హీరో అధర్వ పోషిస్తున్నాడు. ఇతడి సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన వరుణ్ తేజ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఐనాంక బోస్ సినిమాటోగ్రాఫర్.

సాంకేతిక నిపుణులు:
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌
స్క్రీన్ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌