రాజశేఖర్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే ?

Wednesday,July 24,2019 - 03:10 by Z_CLU

‘గరుడ వేగ’ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకున్న రాజశేఖర్ లేటెస్ట్ గా  ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘కల్కి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ సినిమాను వీరభద్రం చౌదరితో చేసేందుకు రెడీ అవుతున్నాడట యాంగ్రీ స్టార్.  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్  శరవేగంగా జరుగుతుంది. రాజశేఖర్ కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను రెడీ చేసాడట వీరభద్రం.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.