దూసుకుపోతున్న శంకర్.. 5 రోజుల కలెక్షన్

Tuesday,July 23,2019 - 12:24 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్.. కేవలం ఇది హిట్ సినిమా కాదు. డబుల్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టిన ఈ మూవీ రేపోమాపో డబుల్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతోంది. నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు రామ్. అంతేకాదు.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “నేను శైలజ” సినిమా తన కంప్లీట్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిందో.. ఇస్మార్ట్ శంకర్ సినిమా 5 రోజుల్లో అంత కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని మరో రికార్డు కూడా అందుకున్నాడు రామ్. నైజాంలో 10 కోట్ల రూపాయల షేర్ సాధించిన హీరోల లిస్ట్ లోకి రామ్ కూడా ఎంటరయ్యాడు. త్వరలోనే ఈ సినిమా 200 శాతం ప్రాఫిట్ షేర్ లోకి వెళ్లబోతోంది.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 10.54 కోట్లు
సీడెడ్ – రూ. 4.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.77 కోట్లు
ఈస్ట్ – రూ. 1.46 కోట్లు
వెస్ట్ – రూ. 1.17 కోట్లు
గుంటూరు – రూ. 1.47 కోట్లు
నెల్లూరు – రూ. 0.80 కోట్లు
కృష్ణా – రూ. 1.45 కోట్లు