స్టన్నింగ్ రొమాంటిక్ సాహో పోస్టర్

Tuesday,July 23,2019 - 12:42 by Z_CLU

సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారి అల‌రిస్తున్నాడు ప్ర‌భాస్. ఈరోజు స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేశాడు. అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశం తో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు. ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు..

ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌భ్యులు అంటున్నారు.

ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.