డిస్కోరాజాలో ‘ఐస్ లాండ్’

Friday,January 24,2020 - 01:02 by Z_CLU

ఓ వైపు మాస్ మహారాజ్.. మరో వైపు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే చేసే దర్శకుడు V.I. ఆనంద్. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన వైబ్స్ అంతా ఇంత కాదు. అయితే ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తున్న ఎలిమెంట్ ఐస్ లాండ్ ఎపిసోడ్. హాలీవుడ్ సినిమా ఇంటర్ స్టెల్లార్ సినిమాలో ఇంకో ప్లానెట్ లా చూపించిన లొకేషన్ అదీ. అయితే ఈ లొకేషన్ లో షూట్ చేసినప్పుడు ఫేస్ చేసిన ఎక్స్ పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నాడు దర్శకుడు V.I. ఆనంద్.

 మార్నింగ్ మేము లొకేషన్ కి వెళ్ళినప్పుడు మంచు ‘0 డిగ్రీస్ఉంటే సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికీ ఆ మంచు కరిగి చిన్న చిన్న గుంటలు పడి ఉంటుంది. దానివల్ల కనీసం అడుగు తీసి అడుగు వేయడం కూడా ప్రమాదమే. అక్కడ ట్రావెల్ చేయడానికి స్పెషల్ వెహికిల్స్ ఉంటాయి. వాటిలో ట్రావెల్ చేశాం. ఆ సీక్వెన్సెస్ బిగ్ స్క్రీన్ పై అమేజింగ్ అనిపిస్తుంది’. అని చెప్పుకున్నాడు V.I. ఆనంద్.

బడ్జెట్ కి ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు రామ్ తాళ్ళూరి. దానికి తోడు మాస్ మహారాజ్ ఫ్లెక్సిబుల్ మేనరిజాన్ని 100% వాడుకున్నాడు దర్శకుడు. దానికి తమన్ మ్యూజిక్… ఇప్పటికే ఇంటరెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘డిస్కోరాజా’ గ్రాండ్ సక్సెస్ అందుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.