ఈ సినిమాల సక్సెస్ వెనక మరో బిగ్గెస్ట్ రీజన్...?

Saturday,August 17,2019 - 10:02 by Z_CLU

శర్వా ‘రణరంగం’… ఫస్ట్ షో తోనే సక్సెస్ ట్రాక్ లో పడింది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ ప్రశాంత్ పిళ్ళై కి కూడా దక్కుతుంది. సినిమాలోని కొన్ని కీ సీక్వెన్సెస్ ప్రశాంత్ పిళ్ళై తన ట్యూన్స్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్, సీన్స్ కి మరింత ప్రాణం పోశాయి. ఓ రకంగా దర్శకుడు నిష్టగా రాసుకున్న కథను స్ట్రేట్ గా ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ పిళ్ళై. ఈ వరసలో రీసెంట్ గా రిలీజైన సినిమాల సక్సెస్ వెనక ఉండి కీ రోల్ ప్లే చేశారు మ్యూజిక్ కంపోజర్స్ మరింత మంది ఉన్నారు.

 

ఎవరు –  సినిమాని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు  ట్విస్టులు, క్లైమాక్స్ తప్ప ఇంకేవీ  పెద్దగా గుర్తుండవు కానీ, కాస్త గట్టిగా గమనిస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన మ్యాజిక్ కనిపిస్తుంది.  సినిమాలోని ప్రతి సీక్వెన్సెస్ లో టెంపోకి తగ్గ ట్యూన్ కంపోజ్ చేశాడు శ్రీచరణ్ పాకాల. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమాని ఆల్మోస్ట్ అన్నీ తానై నడిపించాడు.

ఇస్మార్ట్ శంకర్ : రామ్ గురించి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాని, పూరి డైలాగ్స్ తరవాత అంతే మాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా BGM. హీరో ఆటిట్యూడ్ తెరపై కనిపిస్తే, తెర వెనక ఉండి ఆటిట్యూడ్ కి మరింత  మసాల ఆడ్ చేశాడు మణిశర్మ.

రాక్షసుడు : చిన్నగా స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిపించుకునే ట్రాక్ లో పడుతున్నాడు జిబ్రాన్. అది యాక్షనా..? థ్రిల్లరా ..? జోనర్ ఏదైనా… మార్క్ క్రియేట్ చేశానా..? లేదా..? అన్నట్టుగా ఉంటాయి  జిబ్రాన్ ట్యూన్స్. రాక్షసుడు సక్సెస్ లో మ్యాగ్జిమం షేర్ జిబ్రాన్ దే.

బ్రోచే వారెవరురా : వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఈ సినిమాకి. సినిమాలోని ప్రతి సీక్వెన్స్ కి వివేక్ బ్యాలన్స్డ్ గా కంపోజ్ చేసుకున్న ట్యూన్స్, సినిమా స్టాండర్డ్స్ ని రెండింతలు చేశాయి. ‘బ్రోచేవారెవరురా’ సక్సెస్ కి కథ మొదటి రీజన్ అయితే ఈ వరసలో ఇమ్మీడియట్ వచ్చేది వివేక్ సాగర్ కంపోజ్ చేసిన BGM.

కల్కి : ఈ ఏడాది రిలీజైన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రశాంత్ వర్మ విజన్ కి ప్రాణం పోశాడు మ్యూజిక్ కంపోజర్ శ్రవణ్ భరద్వాజ్.

గేమ్ ఓవర్ : ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ప్రతీది స్పెషలే. తాప్సీ దగ్గరి నుండి దర్శకుడి వరకు ప్రతి క్రాఫ్ట్ సినిమా సక్సెస్ కి రీజనయ్యాయి. అయితే ఈ ఎఫర్ట్స్ ని పక్కాగా ప్రెజెంట్ చేశాడు రోన్ ఈథాన్ యోహాన్. ఈ సినిమాకి తాప్సీ హీరోయిన్ అయితే హీరో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.