జీ సినిమాలు ( 12th జూన్ )

Tuesday,June 11,2019 - 10:02 by Z_CLU

అష్టాచెమ్మా

నటీనటులు : నానిశ్రీనివాస్ అవసరాలస్వాతిభార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణిహేమఝాన్సీవాసు ఇంటూరిశివన్నారాయణరాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నానిఅవసరాల శ్రీనివాస్స్వాతిభార్గవి నలుగురికి ఒకేసారిగా  రేంజ్ స్టార్ డం నితీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళిచేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్అనుష్క శెట్టిసోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానంకరుణాకరన్దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్కసోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదుజీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడాచివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడుకుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ

==============================================================================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ :  20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్సోనాల్ చౌహాన్బ్రహ్మానందంఆదిత్య మీనన్రావు రమేష్పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థహేబా పటేల్అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేతవెన్నెల కిషోర్అన్నపూర్ణసత్యసుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చిందిఅర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైందిఅసలు అమల ఎవరుకేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడుఅనేది చిత్ర కధాంశం.