నివేత థామస్ ఇంటర్వ్యూ

Wednesday,June 26,2019 - 12:03 by Z_CLU

నివేత థామస్ ఒక సినిమాలో నటించిందంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో గెస్ చేయలేం… కనీసం అందులో నివేత రోల్ ఏంటన్నది కూడా ఊహించలేం… నివేత స్టోరీ సెలెక్షనే డిఫెరెంట్… చేసేటప్పుడు చేయదగ్గ సినిమా అనిపిస్తేనే చేస్తుంది. అందుకే నివేత ఓ సినిమాలో నటించిందంటే ఆడియెన్స్ లో ‘చూడదగ్గ సినిమా’ అనే ఫీలింగ్ జెనెరేట్ అవుతుంది. అలా ఫుల్ ఫోకస్ లోకి వచ్చింది ‘బ్రోచే వారెవరురా’ సినిమా. ఈ నెల 28 న రిలీజవుతున్న ఈ సినిమా నుండి ఆడియెన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేయొచ్చనేది  చెప్పడానికే స్పెషల్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయింది నివేత థామస్… ఆ విషయాలు మీకోసం..

‘మిత్ర’ గురించి చెప్పలేం…

సినిమాలో నా క్యారెక్టర్ పేరు మిత్ర… ఇక పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన చుట్టు పక్కలా ఉండే క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది… వాళ్ళను బట్టే ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ అందరు అమ్మాయిల్ని రిప్రెజెంట్ చేస్తుంది… అందరికీ కనెక్ట్ అవుతుంది.

‘మిత్ర’ కోరుకునేది…

సినిమాలో ‘భరతనాట్యం’ డ్యాన్సర్ అవ్వాలని కోరుకుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫెరెంట్ గా డిజైన్ చేశారు… చాలా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్ లో…

సినిమా కన్నా ఎక్కువ…

‘బ్రోచే వారెవరురా’… నాకు జస్ట్ సినిమా కాదు… అంతకన్నా ఎక్కువ… అలాగే ఆడియెన్స్ కూడా ఒక పాయింట్ తరవాత జస్ట్ సినిమా చూస్తున్నట్టు చూడరు… సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని ఫీల్ అవుతారు.. ప్రతి సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అవుతారు…

ఒక్క మాటలో చెప్పలేం…

సినిమా కథ ఏంటంటే ఒక్క మాటలో అస్సలు చెప్పలేం… మిత్ర.. తన చుట్టూ ఉండే రిలేషన్ షిప్స్… అనుభవాలు… సిచ్యువేషన్స్.. వాటి మధ్య తను తీసుకునే డెసిషన్స్… అన్నీ కలిపితే బ్రోచేవారెవరురా…

విమెన్ హరాస్ మెంట్ గురించి…

సినిమాలో విమెన్ హరాస్ మెంట్ గురించి కూడా టాపిక్ ఉంటుంది. కానీ దానిని రెగ్యులర్ విధానంలో కాకుండా చాలా బ్యూటిఫుల్ గా  ప్రెజెంట్ చేయడం జరిగింది. సినిమాలోని ప్రతి సంఘటన నమ్మశక్యంగా.. అంతే న్యాచురల్ ఉంటుంది.

సిచ్యువేషన్ ఓరియంటెడ్…

‘బ్రోచే వారెవరురా’ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే ఇది సిచ్యువేషన్ ఓరియంటెడ్ సినిమా. కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి…. అవి ఈ సినిమాలో చూస్తాం… రిలేట్ చేసుకుంటాం…

నేనే ఎందుకు..?

‘మిత్ర’ క్యారెక్టర్ కోసం ఎవరిని పిక్ చేసుకోవాలన్నా, ఫస్ట్ ప్రయారిటీ క్లాసికల్ డ్యాన్సర్ అయి ఉండాలనే అనుకుంటారు… నాకు తెలిసి ఆ ఒక్క రీజన్ తో మేకర్స్ నన్ను అప్రోచ్ అయి ఉంటారు… ఒక్కసారి కథ విన్నాక ‘నో’ అని చెప్పడానికి నాకు ఒక్క రీజన్ కూడా దొరకలేదు…

అదృష్టంగా ఫీలవుతాను…

‘బ్రోచే వారెవరురా’ లాంటి కథ దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి వీల్లేదు… వీలైనంత తొందరగా అవకాశం దక్కించుకోవాల్సిందే… ఇలాంటి కథలు రాసుకోవాలంటే చాలా రీసర్చ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అలా ఆడుతూ.. పాడుతూ రాసుకున్నది కాదు.. అంత కష్టపడ్డారు కాబట్టే.. ఆడియెన్స్ కి సినిమా చూసేటప్పుడు ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ‘బ్రోచే…’ లాంటి కథలో నేనుండటం అదృష్టంగా ఫీలవుతాను…

ఇమేజ్ అంటే నాకు భయం…

నాకు ఒక పర్టికులర్ ఇమేజ్ లో ఉండిపోవడం అంటే భయం. నేను తారక్ తో ‘లవకుశ’ సినిమా చేశాను.. అలాంటి క్యారెక్టర్స్ అయినా నాకిష్టమే… కాకపోతే నేను ప్రయారిటీ ఇచ్చేది బెస్ట్ స్క్రిప్ట్ కి… అంతే…! అంతకు మించి ఇలాంటి సినిమా చేయాలి.. ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలి అని అని పర్టికులర్ గా రూల్ పెట్టుకోలేదు.

నా డబ్బింగ్ నేనే…

‘జెంటిల్ మెన్’ లో కూడా నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి నిజానికి.. కానీ ఆ టైమ్ లో ఎగ్జామ్స్ వల్ల చేయలేకపోయా.. 118 లో నేనే డబ్బింగ్ చెప్పుకున్నా… ఈ సినిమాకి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నా…

‘జెంటిల్ మెన్’ ఇంపాక్ట్…

‘జెంటిల్ మెన్’ సినిమాకి ముందు అసలు నేను తెలుగు సినిమా అగురించి ఇంకా ఆలోచిండం కొద అబిగిన్ చేయలేదు.. ఆ అవకాశం వచ్చినప్పుడు చాలా ఎగ్జైటెడ్ అయ్యా.. న్యూ లాంగ్వేజ్.. అద్భుతమైన కథ అనుకుని చేశా.. కానీ ఆ తర్వాత తమిళ్ కన్నా ఎక్కువగా తెలుగులోనే మంచి అవకాశాలు వచ్చాయి..

అంతా ఫ్యామిలీ ఫీలింగ్..

నాని.. తారక్… ఇప్పుడు విష్ణు.. వీళ్ళందరితో పని చేయడం నిజంగా అదృష్టంగా ఫీలవుతున్నా… వీళ్ళంతా నా మంచి కోరేవాళ్ళే.. వీళ్ళతో పని చేసినంత కాలంలో ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను…

‘బ్రోచే..’ విన్నప్పుడు – చూసినప్పుడు…

‘బ్రోచే..’ కథ విన్నప్పుడు… ఎంత బాగా న్యారేట్ చేశారో.. అంతే బాగా తీస్తే బావుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే.. ఇంత బాగా వచ్చిందేంటి..? అనిపిస్తుంది.. అద్భుతంగా వచ్చింది సినిమా…

అదొకటే చూస్తాను…

సినిమాలో నా క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుంది అనే దానికన్నా.. నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ స్టోరీలో ఏ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేదే ఆలోచిస్తాను.. 118 లో నేను కనిపించేది మహా అయితే 15 నిమిషాలే… కానీ అది ఆ సినిమాలో క్రియేట్ చేసే ఇంపాక్ట్… మ్యాటర్స్…

ఏమో అవుతానేమో…

నాకు కెమెరా వర్క్ అంటే చాలా ఇష్టం.. ఏదైనా ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ తెలిసినప్పుడు కానీ.. దీన్ని సినిమాలా తీస్తే బావుంటుంది కదా అనుకుంటూ ఉంటాను… ఇప్పుడు నటిని కాబట్టి ఫ్యూచర్ లో వేరే క్రాఫ్ట్స్ లో పని చేయకూడదు అని రూల్ లేదు.  ఏమో ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ నో.. కెమెరా విమెన్ నో.. ఇంకేదైనా  అవుతానేమో.. ఏదైనా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి కానీ అన్నీ జరిగిపోతాయి…